యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించి గత కొన్నిరోజులుగా ఎలాంటి అప్ డేట్లు లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా కేవలం 7 నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ తక్కువ సమయంలోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
ఎన్టీఆర్ కొరటాల కాంబో కొత్త సినిమా షూటింగ్ ను కూడా కుదిరితే సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఏడాది మార్చి 25వ తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అదే సమయంలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. తారక్ కు జోడీగా పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తుండగా త్వరలో ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా ఫైనల్ అవుతారో తేలే ఛాన్స్ ఉంటుంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తారక్ కు జోడీగా నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తారక్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. తారక్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!