Jr NTR: ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ లాంచ్ లో ఎన్టీఆర్ ఆసక్తికరమైన కామెంట్లు..!

దిల్ రాజు ఫ్యామిలీ నుండీ ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శిరీష్ కొడుకు అతను. ‘రౌడీ బోయ్స్’ చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. ట్రైలర్ ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ ‘నైస్ నైస్ బాగుంది.. ఎప్పుడో ‘ప్రేమదేశం’ అప్పుడు చూసాను ఇలాంటి కంటెంట్’ అంటూ ప్రశంసించాడు.

అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం.. ఈరోజు చాలా నాస్టాలజిక్ డే నాకు. రాజు గారితో అండ్ శిరీష్ గారితో.. నేను రాజన్నా, శిరీష్ అన్నా అంటాను. బట్ కెమెరా ముందు ఉన్నాం కాబట్టి రాజు గారు శిరీష్ గారు అని కొంచెం పద్ధతిగా చెప్తే బాగుంటుంది.’ఆది’ అప్పుడు మా అసోసియేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఆశీష్ ఇంకా పరిచయం కూడా లేడు అప్పుడు. బహుశా ఇంకా చిన్న పిల్లాడు అనుకుంట.

 

తను చిన్నపిల్లాడు.. ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే నన్ను నేను ముసలాడిని చేసుకుంటున్నట్టు అవ్వుద్ది. అందుకే చెప్పాను నాస్టాలజిక్ గా ఉందని..!ఈ రోజు మా శిరీష్ అన్న కొడుకు ట్రైలర్ ను లాంచ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళిద్దరితో ఉండే జర్నీని మళ్ళీ నెమరువేసుకుంటానికి ఇది ఒక మంచి ప్లాట్ ఫామ్ లాగా నేను భావిస్తున్నాను. థాంక్స్ టు శ్రీ హర్ష గారు.. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఆశీష్ గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడితే.. నా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది.

బట్ నీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఎన్నో చిత్రాలు ఇంకా చేయాలని.. ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను భాగం కావాలని ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను నటుడిగా నటించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు.. శిరీష్ గారు, రాజు గారు..! రాజు గారితో సెట్ లు, స్క్రిప్ట్ ల గురించి డిస్కస్ చేస్తాను. కానీ శిరీష్ తో ఎక్కువగా కామెడీ చేస్తుంటాను. ఆయన మొహంలో నవ్వు ఎప్పుడైనా ఉండాలి అంటే ఆశీష్ బాగుండాలి.

ఈ చిత్రం నిజంగా ఘనవిజయం సాధించాలని.. ఇలాంటి కోవిడ్ టైములో కూడా ఓ మంచి చిత్రంగా మనల్ని అలరించాలని. ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నా సినిమా(ఆర్.ఆర్.ఆర్) కోసం కూడా నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ గా భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus