Jr NTR: దేవరలో ఎన్టీఆర్ అసలు లుక్ ను దాచేశారా.. ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ సినిమాలో దయా పాత్రతో పాపులర్ అయిన తారక్ పొన్నప్ప అనే నటుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నటుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. దేవర ఎన్టీఆర్ సీక్రెట్ లుక్ ఒకటి ఉందని ఆ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుందని ఆయన తెలిపారు.

దేవరలో యంగ్ టైగర్ ఒరిజినల్ లుక్ తో పోల్చి చూస్తే ఇప్పటికే చూసిన ఎన్టీఆర్ పోస్టర్ నథింగ్ అని తారక్ పొన్నప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే పునీత్ రాజ్ కుమార్ గుర్తుకొస్తారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ తొలిసారి మాట్లాడిన సమయంలో ఆయన బాగా పలకరించారని తారక్ పొన్నప్ప పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ గా స్వాగతం పలికారని ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని తారక్ పొన్నప్ప అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఆటిట్యూడ్ చూపించరని స్నేహపూర్వకంగా ఉంటారని తారక్ పొన్నప్ప కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఆయన సెట్ లో ఉంటే కంఫర్ట్ గా ఫీలవుతాయని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ సినిమాలోనే చూడాలని జూనియర్ ఎన్టీఆర్ నటన చూస్తే గూస్ బంప్స్ వస్తాయని ఎన్టీఆర్ గత సినిమాలను మించి ఈ సినిమ్దా ఉంటుందని తారక్ పొన్నప్ప పేర్కొన్నారు.

దేవర సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా (Jr NTR) తారక్ పొన్నప్ప కామెంట్లతో సినిమాపై అంచనాలు పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. దేవరలో ట్విస్ట్ లు కూడా మామూలుగా ఉండవని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus