Jr NTR: ఈ ఒక్క సినిమాలో తారక్ తనకంటే పెద్ద హీరోయిన్ తో చేశారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ తన కెరియర్ లో ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలోను తనకంటే చిన్న హీరోయిన్లతోనే ఈయన నటించారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కెరియర్ లో ఒకే ఒక సినిమాలో మాత్రమే తనకన్నా వయసులో పెద్ద హీరోయిన్ తో కలిసి ఈయన రొమాన్స్ చేశారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

మరి ఏ సినిమాలో ఎన్టీఆర్ తనకంటే పెద్ద హీరోయిన్ తో కలిసి నటించారు. ఆ సినిమా ఏంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ భూమిక అంకిత హీరోయిన్లుగా నటించిన చిత్రం సింహాద్రి. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అంకిత భూమిక ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమాలో నటి భూమిక ఎన్టీఆర్ కన్నా వయసులో పెద్దదని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమాలో మాత్రమే ఎన్టీఆర్ తనకన్నా పెద్ద హీరోయిన్ తో కలిసి నటించారని సరదాగా ఈ వార్త వైరల్ గా మారింది. ఇక అప్పట్లో సింహాద్రి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత తిరిగి ఎన్టీఆర్ భూమికతో ఏ సినిమాలోను నటించలేదు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus