‘బిగ్ బాస్ 3’ కి జూ.ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..?

గత కొంత కాలంగా అందరిలోనూ ఉన్న డౌట్ ఒకటే ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ ఎవరు..? ఈ ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికేసిందనే చెప్పాలి. ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూ.ఎన్టీఆరే… ‘బిగ్ బాస్ 3’ కి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. హోస్ట్ గా తారక్ సీజన్ 1 ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాడు. ఇక ‘బిగ్ బాస్ 2’ ని కూడా నాని సక్సెస్ ఫుల్ గానే వ్యహరించినప్పటికీ… స్క్రిప్ట్ మరియు కంటెస్టంట్స్ మధ్య గొడవలతో షో మొత్తం గందరగోళంగా మారింది. గేమ్ పైన ఫోకస్ పెట్టకుండా.. పర్సనల్ లైఫ్ కి సంబందించిన గొడవలతో కంటెస్టెంట్స్ అందరూ హౌస్ ని రచ్చ చేసారు. ఈ క్రమంలో హోస్ట్ గా చేసిన నాని కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా కౌశల్ విషయంలో నాని బాగా కంగారుపడిపోయాడు. ఈ విషయంలో కౌశల్ ఆర్మీ నాని ని టార్గెట్ చేసి నిరసనకు దిగారు. నాని సినిమాలను కూడా మేము చూడము అంటూ ‘దేవదాస్’ చిత్రం పై విరుచుకుపడ్డారు. దీంతో నెక్స్ట్ సీజన్ చేయమని ‘స్టార్ మా’ అడిగినప్పటికీ… నాని నిరాకరించాడట. దీంతో ఎన్టీఆర్ కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ ఒప్పించారట.

‘బిగ్ బాస్ 3’ కోసం ఎన్టీఆర్ కి 20 కోట్లు వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ కొన్ని కండిషన్స్ మేరకు అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనికి ‘స్టార్ మా’ కూడా అంగీకరించారట. ‘బిగ్ బాస్ 2’ చూసిన తారక్ కంటెస్టంట్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పాడట. హౌస్ కి వచ్చే కంటెస్టెంట్స్ బయట ఫ్రెండ్స్ అయి ఉండకూడదని… అన్ని రంగాల వారిని కవర్ చేసేలా కంటెస్టంట్స్ ని తీసుకోవాలని… కేవలం సెలబ్రిటీస్ ను మాత్రమే తీసుకోకూడదని చెప్పాడట. ఏదేమైనా ‘బిగ్ బాస్ 2’ తో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక త్వరలోనే ‘బిగ్ బాస్ 3’ కి సంబందించిన అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కంటెస్టంట్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus