Jr NTR: ఎన్టీఆర్ షో విజేతలకు పన్ను అన్ని లక్షలా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ప్రసారమవుతున్న రియాలిటీ షోలో ఎస్సై రాజా రవీంద్ర ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలను చెప్పి రాజా రవీంద్ర విజేతగా నిలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన రాజా రవీంద్ర 2012 సంవత్సరంలో ఎస్సై జాబ్ సంపాదించారు. ఎస్సై జాబ్ కంటే ముందు రాజా రవీంద్ర ఇతర ఉద్యోగాలు చేశారు.

రాజా రవీంద్ర భార్య పేరు సింధూజ కాగా ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భారత్ తరపున ఒలింపిక్స్ లో ఆడటమే తన లక్ష్యమని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు గెలిచిన రాజా రవీంద్రకు పన్ను మినహాయించగా దక్కే మొత్తం కేవలం 68,80,000 రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. 31,20,000 రూపాయలు రాజా రవీంద్ర పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం రియాలిటీ షో,

గేమ్ షోలలో పాల్గొని 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం గెలిస్తే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఐటీ యు/ఎస్ 194బి చట్టాన్ని అనుసరించి 31.2 శాతం ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. రాజా రవీంద్ర 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్ర గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus