Jr NTR: ఎన్టీఆర్ అభిమానులకి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ తనయుడు..!

భారతదేశంలో సినిమా ఒక మతమైతే.. సినీ తారలే దేవుళ్లు. వారిని ఇలవేల్పులుగా పూజిస్తూ వుంటారు ప్రేక్షకులు. తాతలు, తండ్రుల నుంచి ఆస్తుల్ని వారసత్వంగా తీసుకున్నట్లే.. వారు అభిమానించిన సినీ తారలను తరతరాలుగా ప్రేమిస్తూ వుంటారు. మనదేశంలోని అన్ని పరిశ్రమలలో వందల మంది హీరోలు, హీరోయిన్లు వున్నారు. మరి వారి ఇళ్లలో వారు వాళ్లనే ఇష్టపడతారా అంటే అది చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే ఎవరి అభిష్టం వారిది కాబట్టి. ఇక అసలు విషయం లోకి వెళితే..

సూపర్‌స్టార్ మహేశ్ బాబుని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. గ్రీకు వీరుడి లాంటి మేనిఛాయతో మెరిసిపోతూ వుంటారు. అమ్మాయిలైతే తమకు కాబోయే భర్త అచ్చం మహేశ్‌లాగే వుండాలని కోరుకుంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రాంతాలకు అతీతంగా ఆయన ఫ్యాన్సే. ఇతర హీరోలు, వారి అభిమానులు కూడా ప్రిన్స్‌ అందానికి, నటనకి ఫిదా అవుతారు. ఈ విషయం ఎన్నో వేదికల మీద ఎంతో మంది చెప్పారు. ఈ లిస్ట్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కుమారుడు కూడా చేరిపోయాడు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జక్కన్న టేకింగ్.. చెర్రీ, ఎన్టీఆర్‌ల నటనకు ప్రజలు బ్రహ్మారథం పట్టారు. విడుదలైన రోజు నుంచి నేటి వరకు ఆర్ఆర్ఆర్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ జరిగింది. దీనికి ఎన్టీఆర్‌తో పాటు పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా పాల్గొన్నాడు.

ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా.. టక్కున మహేష్ బాబు అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేసాడు. మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. ఆయన నటించిన బిజినెస్ మేన్ మూవీ చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు . ఇంకేముంది అభయ్ మాటలకు ఫిదా అయిన మహేష్ ఫ్యాన్స్ .. తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus