Jr NTR: హ్యాపీ బర్త్ డే అమ్మలు..భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తారక్.. ప్రేమను కురిపిస్తూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఎన్టీఆర్30 రెగ్యులర్ షూట్ మరో మూడు రోజుల్లో మొదలుకానుంది. ఈరోజు ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. భార్య పుట్టినరోజు సందర్భంగా తారక్ హ్యాపీ బర్త్ డే అమ్మలు అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన భార్యను ప్రేమగా అమ్మలు అని పిలుస్తానని తారక్ చెప్పకనే చెప్పేశారు. ఒకవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న తారక్ మరోవైపు కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు కొన్ని గంటల్లోనే 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ తారక్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ మధ్య కాలంలో తారక్ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు కూడా సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే తారక్ మాత్రం కొడుకులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. ఎన్టీఆర్ కొడుకులు బాల నటులుగా సినిమాల్లోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నా తారక్ మాత్రం భిన్నంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏ మాత్రం ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఈ సినిమాలో తారక్ డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

తారక్ తర్వాత సినిమాలు సైతం రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలతో సైతం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus