తల్లి గా, ఇల్లాలిగా, చెల్లిగా, స్నేహితురాలిగా.. ప్రతి మగాడి వెనుక ఓ ఆడది ఉంటుంది. వారి ప్రేమానురాగాలు, ప్రోత్సాహంతోనే విజయతీరాన్ని చేరుకుంటుంటారు. అందుకే పెద్దలు అన్నారు.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ విజయం ఉంటుందని. అటువంటి ఆమెకు థాంక్స్ చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు. అయినా ఆమెను ప్రత్యేకంగా చూసుకోవడానికి ఈరోజు ఉంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భం గా ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విభిన్నంగా విషెష్ చెప్పారు. తన తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతి కలిసి నవ్వుతున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసి “నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు వీరే” అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు “మనవారి మొహాల్లో నవ్వు తెప్పించడమే అసలైన ఆనందం” అని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.