Jr NTR, Teja Sajja: తేజ సజ్జాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహా ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్నా హనుమాన్ మూవీకి కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈగల్ రిలీజయ్యే వరకు హనుమాన్ మూవీకి కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఢోకా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తేజ సజ్జా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ ఇచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చారు. బాలనటుడిగా 50కు పైగా సినిమాలలో నటించానని రెండున్నర సంవత్సరాల వయస్సులో మొదటి మూవీ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు.

చూడాలని ఉంది సినిమాతో ఊహ తెలిసే సమయానికి నటుడిని అయ్యానని రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, ఇంద్ర, గంగోత్రి సినిమాలలో నటించానని తేజ సజ్జా చెప్పుకొచ్చారు. బాలనటుడిగా తమిళ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా యాక్ట్ చేశానని ఆయన కామెంట్లు చేశారు. బాల్యం నుంచి హీరో కావాలని కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చానని తేజ సజ్జా వెల్లడించారు.

హనుమాన్ మూవీ కోసం స్కూబా డ్రైవింగ్ నేర్చుకున్నానని తేజ సజ్జా కామెంట్లు చేశారు. హనుమాన్ మూవీ కోసం వాడిన లెన్స్ వల్ల 70 శాతం కార్నియా దెబ్బ తిందని సినిమా షూట్ లో ఎన్నో గాయాలను భరించానని తేజ సజ్జా కామెంట్లు చేయడం గమనార్హం. ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి పోయాయని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారని నాలుగేళ్లు కష్టపడి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నానని తేజ సజ్జా పేర్కొన్నారు.

ఖాళీ సమయం దొరికితే గంటల తరబడి సినిమాలు చూస్తానని స్విట్జర్లాండ్, వైజాగ్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. చికెన్ శాండ్విచ్ అంటే పిచ్చి అని రోజూ తినమన్నా తింటానని తేజ సజ్జా చెప్పుకొచ్చారు. తేజ సజ్జా భవిష్యత్తులో హనుమాన్ మూవీని మించిన హిట్లు సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus