Jr NTR: ప్రశాంత్ నీల్ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇచ్చిన ఎన్టీఆర్!

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్ సకలకళా వల్లభుడు. అతనికి రాని విద్య అంటూ ఏమీ ఉండదు’..ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్ స్నేహితులు చెప్పే మాటలు ఇవి. ఎందుకో చాలా మందికి ఈపాటికే తెలిసిపోయి ఉండొచ్చు. సినిమాల పరంగా అందరికీ చాలా వరకు తెలిసి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న ఇంకో టాలెంట్ ఏంటో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అదేంటి అంటే.. ఎన్టీఆర్ లో బెస్ట్ కుక్ ఉన్నాడు. ‘బిగ్ బాస్’ టైంలో ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు.

హౌస్మేట్స్ అందరి కోసం అతను వంట చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ చాలా వెరైటీస్ చేయగలడు అనే విషయం కూడా కొంతమందికే తెలుసు. తన భార్యా, పిల్లల కోసం ఎన్టీఆర్ చాలా రకాల వంటలు చేసిపెడతాడు. తాజాగా అతను దర్శకుడు ప్రశాంత్ నీల్ ను బెంగళూరులో కలుసుకోవడం జరిగింది. ఓ ప్రైవేట్ పార్టీలో ఈ స్టార్స్ కలుసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎన్టీఆర్ (Jr NTR) తల్లి కూడా బెంగళూరుకి చెందిన వ్యక్తి. ఆ రకంగా కూడా అక్కడ ఎన్టీఆర్ కి చాలా మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. పనిలో పనిగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ వారి కోసం ఎన్టీఆర్ కుక్ అవతారం ఎత్తి నాటుకోడి పులుసు వండిపెట్టాడట. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి నీల్ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ద్వారా తెలియజేసింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus