యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉండగా ఈ మూడు సినిమాలలో దేవర 2024 సంవత్సరంలో విడుదల కానుండగా 2025లో వార్2, తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 1200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. దేవర బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ప్రశాంత్ నీల్ తారక్ మూవీ బడ్జెట్ 400 కోట్ల రూపాయలు వార్2 సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
సినిమా సినిమాకు తారక్ కు క్రేజ్ పెరుగుతుండగా తారక్ సినిమాల బడ్జెట్ సైతం పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. వరుసగా తారక్ సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మరింత క్రేజీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. రాజమౌళి, లోకేశ్ కనగరాజ్, అట్లీ డైరెక్షన్ లో తారక్ ప్రాజెక్ట్ లు ఉండే ఛాన్స్ అయితే ఉందని సమాచారం.
స్క్రిప్ట్ విషయంలో తారక్ పెడుతున్న శ్రద్ధ అంతాఇంతా కాదు. స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇస్తే మాత్రమే తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను సైతం సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో తారక్ పూర్తిస్థాయి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో సైతం నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. టాలెంట్ ఉంటే ఫ్లాప్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి తారక్ సిద్ధంగా ఉన్నారు.
తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా నిర్మాతలకు లాభాలను అందించాలని (Jr NTR) తారక్ ఆకాంక్ష కాగా తన అభిమానులకు కొత్తదనం ఉండే కథలను అందించడానికి తారక్ తనవంతు కష్టపడుతున్నారు. ఇకపై కెరీర్ పరంగా సినిమాల విషయంలో గ్యాప్ రాకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే సినిమాల విషయంలో తారక్ సత్తా చాటుతున్నారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!