యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గత నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. కొరటాల శివ, ఎన్టీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు.
ఈ నెల 14వ తేదీనుంచి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ మొదలుకానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇప్పట్లో రిలీజ్ కాదని భావించవచ్చు. అయితే వచ్చే నెల 11వ తేదీన ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి ప్రకటన రావచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వార్తలు తెరపైకి వస్తుండటంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ వెంటనే మొదలవుతుందా? లేక ఆలస్యమవుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇతర హీరోలలా ఎన్టీఆర్ కూడా వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీకి పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
సినిమాల విషయంలో తారక్ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుండగా త్వరలో అభిమానుల ప్రశ్నలకు ఎన్టీఆర్ నుంచి సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ త్వరగా మొదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఏప్రిల్ 11వ తేదీన అభిమానులకు షాక్ ఇస్తారో సర్ప్రైజ్ ఇస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!