NTR, Balakrishna: బాబాయ్ సినిమాకి అబ్బాయి వాయిస్ ఓవర్..అభిమానులకు పండగే..!

‘అఖండ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి రాబోతున్న భారీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరసింహారెడ్డి’. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ బడా సంస్థల్లో ఒకటైన ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.

దానికి మంచి టాక్ వచ్చింది. గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కచ్చితంగా ఈ సినిమా నందమూరి అభిమానులనే కాకుండా మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుందని.. చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే.. ‘వీరసింహారెడ్డి’ మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట.

15 నిమిషాల పాటు ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ… ఇది నిజమైతే ‘వీరసింహారెడ్డి’ కి డబుల్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ముఖ్యంగా నందమూరి అభిమానులకు పెద్ద పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. ఈ బాబాయ్ అబ్బాయ్ లకు తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. పైగా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్టు కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు.

వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టె ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా బాలయ్య లాంటి సీనియర్ హీరో సినిమాకి ఇప్పటి స్టార్ హీరో పుషింగ్ ఉంటే.. మంచి రిజల్ట్ అందుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. ‘అఖండ’ ప్రీ రిలీజ్ కు బన్నీ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్ వంటివి ఇస్తే ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ లు ఉంటాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus