తారక్ తో హాట్ సీట్ లో ఆడేదెవరు..?

బిగ్ బాస్ సీజన్ – 1 తో హోస్ట్ గా సూపర్ డూపర్ దుమ్మురేపిన తారక్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ మరోసారి హోస్ట్ అవతారం ఎత్తాడు. జెమిని టెలివిజన్ లో వస్తున్న ఈ షో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఊరిస్తోందనే చెప్పాలి. రీసంట్ గా ఈ షో గురించి ప్రోమోలని షూట్ చేసింది త్రివిక్రమ్ అండ్ టీమ్. నిజానికి ఇది కొత్త షో ఏమీ కాదు, గతంలో నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటిదే.

కాస్త గేమ్ రూల్స్ ఛేంజ్ చేసి టైటిల్ ని అటు ఇటూ మార్చి పెట్టారంతే. నాగార్జున హోస్ట్ చేసిన MEK – మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆతర్వాత ఈ షోని కొన్ని ఎపిసోడ్స్ మెగాస్టార్ చిరంజీవి కూడా చేశారు. అది పెద్దగా ఎక్కువ ఎపిసోడ్స్ ని నడిపించలేకపోయారు. ఇప్పుడు తారక్ ఇదే షోని హోస్ట్ చేస్తూ మళ్లీ ప్రేక్షకులకి హాట్ సీట్ ని పరిచయం చేయబోతున్నాడు. త్వరలోనే టెలివిజన్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు సందడి చేయబోతున్నాయి. అంతేకాదు, ఈ షోలో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతంలో నాగార్జన హోస్ట్ చేసిన కార్యక్రమంలో ఎంతోమంది మేధావులు వచ్చి షోని హిట్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా చాలా ఫెయిర్ గా జరిగిందనే చెప్పాలి. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ? హాట్ సీట్ లో కూర్చోవాలంటే ఏం చేయాలి అనేది ప్రోమోగా రాబోతున్నట్లుగా సమాచారం. అంతేకాదు, ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్ లో సెలబ్రిటీలో సైతం షోలో పార్టిసిపేట్ చేస్తూ తారక్ ని పలకరించబోతున్నారని చెప్తున్నారు. మొత్తానికి జూనియర్ ఈ షోని నెక్ట్స్ లెవల్ కి తీస్కెళ్తాడా లేదా అనేది ఆసక్తికరం. అదీమేటర్.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus