Jr NTR T-shirt Cost: యంగ్ టైగర్ టీషర్ట్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఈతరం హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా నుంచి తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే సంగతి తెలిసిందే. వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి కథలలో నటించడంపై తారక్ దృష్టి పెట్టారనే విషయం తెలిసిందే. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ ఈవెంట్ లో తారక్ ధరించిన టీషర్ట్ ఖరీదు ఏకంగా 24,000 రూపాయలు అని సమాచారం. టీషర్ట్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం సాధారణ, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కష్టమైనా స్టార్ హీరోలకు కష్టం కాదనే సంగతి తెలిసిందే. టీషర్ట్ లో తారక్ మరింత అందంగా కనిపించారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ వాచ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బింబిసార మూవీ గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్లు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచాయి. బింబిసారతో కళ్యాణ్ రామ్ కు కూడా స్టార్ స్టేటస్ దక్కడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు. తారక్ బింబిసార ఈవెంట్ లో తర్వాత సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తారని అభిమానులు భావించినా అందుకు భిన్నంగా జరిగింది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ షూట్ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది.

బింబిసార సక్సెస్ ను సొంతం చేసుకుంటే బింబిసార2 సినిమాలో తారక్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. బింబిసార2 సినిమాతో నందమూరి మల్టీస్టారర్ ను అభిమానులు కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు కళ్యాణ్ రామ్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ దక్కడానికి కారణమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus