Jr NTR: తారక్ పుష్ప2 సెట్స్ లో కనిపించడానికి కారణం ఇదేనా?

స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. పుష్ప1 ను మించి ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. 400 నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు తారక్ కొరటాల శివ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ఒక సినిమాతో మరొకటి పోటీ పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో వైరల్ అవుతున్న వార్తలను తారక్ ఫ్యాన్స్ నమ్మడం లేదు. అయితే తాజాగా పుష్ప2 మూవీ సెట్స్ లో తారక్ సందడి చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం బన్నీ పుట్టినరోజు సందర్భంగా తారక్ బావా అంటూ ప్రేమగా విష్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న పిక్ లో తారక్ ఫార్మల్ లుక్ లో కనిపిస్తున్నారు. బన్నీని తారక్ సాధారణంగానే కలిశారని పుష్ప2 టీమ్ నుంచి వినిపిస్తోంది. బన్నీ తారక్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ ను సెట్ చేయడం కష్టమేం కాదు. త్వరలో పుష్ప2 సెట్స్ లో (Jr NTR) తారక్ ప్రత్యక్షం కావడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తారక్, బన్నీలకు వేర్వేరుగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus