Jr NTR,Pranathi: భార్యతో ఎన్టీఆర్ రొమాంటిక్ టాక్.. లేటెస్ట్ ఫోటో వైరల్..!

4 ఏళ్ళ పాటు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికే అంకితమైన ఎన్టీఆర్ కు.. ఇప్పుడు కాస్త పెద్ద బ్రేకే దొరికింది.మార్చి 25న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. ఈ మూవీలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. తన పాత్రకి దేశ విదేశాల ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది.

తన నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు వినికిడి. ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు బ్రేక్ టైం దొరకడంతో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే విదేశాలకు వెళ్లొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు తన భార్య.. పిల్లలకు క్వాలిటీ టైంని కేటాయించాడు.

ఈ క్రమంలో తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి సరదాగా కాఫీ తాగుతూ ముచ్చటిస్తున్న ఫోటోని షేర్ చేశాడు ఎన్టీఆర్.అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంట రొమాంటిక్ గా కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి క్వాలిటీ టైంని కేటాయిస్తూ ఉంటాడు ఎన్టీఆర్.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus