Devara: దేవర షూట్ అప్పటికి పూర్తవుతుందా.. అన్ని డేట్స్ కావాలా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సైఫ్ అలీ ఖాన్ గాయం వల్ల ఈ సినిమా షూట్, రిలీజ్ డేట్ వాయిదా పడ్డాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సైఫ్ అలీ ఖాన్ కూడా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లోనే సాంగ్స్ కూడా పూర్తి కానున్నాయని సమాచారం అందుతోంది.

మార్చి నెల చివరి వారం సమయానికి దేవర షూట్ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. షూట్ మొత్తం పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం శరవేగంగా పూర్తి చేసి ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. వీలైనంత వేగంగా సినిమా రిలీజయ్యేలా దేవర మేకర్స్ అడుగులు పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

దేవర సినిమా (Devara) జాన్వీ కపూర్, కొరటాల శివ, అనిరుధ్ కెరీర్ లను డిసైడ్ చేయనుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే వీళ్లకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఇతర భాషల నటులు నటిస్తున్నా ఈ సినిమాలో టాలీవుడ్ నటులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సముద్రతీరం బ్యాక్ డ్రాప్ కథలకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే కథలను ప్రేక్షకులు సైతం ఫ్రెష్ గా ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతుండగా ఈ సినిమా ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేసి భారీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus