యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) , కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర (Devara) మూవీ ప్రీపోన్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సెప్టెంబర్ నెల 27వ తేదీన విడుదల కావాల్సిన ఓజీ (OG Movie) ఆ తేదీ నుంచి తప్పుకుంటే మాత్రం దేవర కచ్చితంగా సెప్టెంబర్ 27వ తేదీకి ప్రీపోన్ కానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారికంగా క్లారిటీ లేదు.
వాస్తవానికి అక్టోబర్ నెలలో దేవర మూవీ విడుదలైతే ఈ సినిమాకు వేట్టయాన్, కంగువ (Kanguva) సినిమాల నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ సినిమాల వల్ల దేవర థియేటర్ల విషయంలో కొంతమేర నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదలైతే దసరా సెలవులను పూర్తిస్థాయిలో ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. దేవరకు ఈ డేట్ పర్ఫెక్ట్ డేట్ అవుతుందని ఈ తేదీన విడుదలైతే ఏ రికార్డ్స్ మిగలవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగానే ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో తారక్ పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ సైతం ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
కొరటాల శివకు ఈ సినిమా తప్పనిసరిగా పూర్వ వైభవం తెచ్చే సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు.