Venu Swamy, Pawan Kalyan: పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
- May 8, 2024 / 06:57 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సర్వేలు సైతం పవన్ కు అనుకూలంగా ఉండటం ఆయనకు ప్లస్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వొచ్చు కానీ సీఎం మాత్రం అయ్యే అవకాశం లేదని వేణుస్వామి చెబుతుండటం గమనార్హం. పవన్ జాతకంలో సీఎం యోగం అయితే లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ రాజకీయాలలో మోసపోతారని చంద్రబాబు, పవన్ కలవడం వల్ల ఒకసారి మాత్రమే ప్లస్ అవుతుందని 2014లోనే వాళ్లిద్దరూ కలవడం వల్ల ఆ పార్టీలకు మంచి జరిగిందని వేణుస్వామి వెల్లడించారు.
పవన్ ది ఉత్తరాషాడ నక్షత్రం అని ఆయన అన్నారు. పవన్ జాతకం తాను చెబుతున్నానే తప్ప పవన్ తో పర్సనల్ గా ఎలాంటి వైరం లేదని వేణుస్వామి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. వేణుస్వామి తన సక్సెస్ రేట్ 98 శాతం అని చెప్పుకుంటారని ఆయన చెప్పిన విషయాలలో అన్నీ జరుగుతాయని కచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవని ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేస్తున్నారు.

పవన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని భవిష్యత్తులో ఆయన తప్పకుండా సీఎం అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పవన్ విషయంలో వేణుస్వామి కామెంట్లు నిజం అవుతాయో లేదో చూడాలి.వేణుస్వామి పాపులారిటీ కోసమే సెలబ్రిటీల పేర్లను వాడుకుంటూ జాతకాల పేర్లతో కామెంట్లు చేస్తారని మరి కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

వేణుస్వామి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన జోస్యం నిజం అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వేణుస్వామి ఎన్నికల సమయంలో ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. వేణుస్వామి హీరోయిన్ల కోసం పూజలు చేస్తే డబ్బులు తీసుకోనని చెబుతున్నారు.

















