Jr NTR: మరోసారి అడవులలోనే ఎన్టీఆర్ పోరాటాలు!

Ad not loaded.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)   తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డ్రాగన్ తో మరోసారి భారీ యాక్షన్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రశాంత్ నీల్  (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌కు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్, అతని అసలు ఫోకస్ మాత్రం డ్రాగన్ మీదే.

Jr NTR

తాజా సమాచారం మేరకు, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 17 నుంచి మొదలవుతుంది. అయితే, ఇది ఎన్టీఆర్ పాల్గొనని షార్ట్ షెడ్యూల్ మాత్రమే. ముందుగా, సినిమాలో కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లు, నేచురల్ విజువల్స్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వికారాబాద్ అనంతగిరి అడవుల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్‌లో జాయిన్ అవ్వనున్నాడు. ఎన్టీఆర్ గత సినిమాల లాగే, డ్రాగన్ లో కూడా అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్.

RRRలో కొమరం భీమ్ గా, దేవరలో (Devara) అడవుల నేపథ్యం ఎంత హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా తనదైన స్టైల్ లో ఎన్టీఆర్ కోసం గ్రాండ్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సీక్వెన్స్‌లు ప్లాన్ చేశారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్, యాక్షన్, ఫైట్స్ ఎలా ఉంటాయనే విషయంపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar)  లాంటి సినిమాలతో భారీ విజువల్స్ అందించిన దర్శకుడు కావడంతో, డ్రాగన్ టేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

అడవుల్లో జరగబోయే ఛేజింగ్ సీక్వెన్స్‌లు, యాక్షన్ బ్లాక్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించనున్నట్టు టాక్. ఇంకా పలు కీలక పాత్రల కోసం ప్రముఖ నటులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మేకర్స్ 2026 జనవరి 9 విడుదల తేదీని అనౌన్స్ చేసినప్పటికీ, తాజా షెడ్యూల్ వివరాల ప్రకారం సినిమా అప్పటికి పూర్తవుతుందా? లేదా? అనే సందేహం ఇంకా కొనసాగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus