Jr NTR: మే 20న జూనియర్ ఎన్టీఆర్ 40వ పుట్టినరోజుకి ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న న్యూస్ లేదా అప్‌డేట్ వచ్చిందటే చాలు.. దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్.. వాళ్లకి కావలసిన అప్‌డేట్ ఇవ్వకపోతే ఏ రేంజ్‌లో రచ్చ చేస్తారో తెలిసిందే. రీసెంట్‌గా ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. NTR 30కి సంబంధించిన అప్‌డేట్ తారక్ తన నోటితో తాను చెప్తే కానీ శాంతించలేదు. నందమూరి వంశం నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే తాతకి తగ్గ మనవడిగా..

తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా మారాడు. నటన, డ్యాన్స్, డైలాగ్స్, ఎమోషన్స్ పండించే విధానం.. వీటిలో తనకు సాటి ఎవరూ రాలేరని నిరూపించుకున్నాడు.. కొద్ది కాలం వరుస ఫ్లాపులతో సతమతమైన తారక్.. వరుసగా ఆరు సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్‌ కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో యంగ్ టైగర్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. తనకిది ఫస్ట్ పాన్ ఇండియా సినిమానే అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా ‘కొమరం భీముడో’ పాటలో తారక్ పలికించిన హావభావాలకు, నటనకు మూవీ లవర్స్, ఆడియన్స్‌‌తో పాటు రాజకీయ నాయకులు సైతం ఫిదా అయిపోయారు. పలు దేశాలకు చెందిన పేపర్లు, పత్రికలు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక కథనాలు రాశాయి. మే 20న తారక్ 40వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. దీని కోసం ఇప్పటినుండే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 100 రోజుల ముందుగానే హంగామా స్టార్ట్ చేసేశారు. ఫిబ్రవరి 9 నుండి లెక్కేస్తే పుట్టినరోజుకింకా హండ్రెడ్ డేస్ ఉంది.

ఈసారి భారీ ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 100 డేస్ టు గో.. #ManOfMassesNTR బర్త్‌డే.. అంటూ #100DaysToGoHappyBirthdayNTR హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ తన 30వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివతో చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో.. ఊహకందని కథ, కథనాలతో.. భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus