Jr NTR: RRR తరువాత ఆ దర్శకులతోనే

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న తారక్ మరియు అతని కుటుంబ సభ్యులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక చాలా రోజుల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా విశేషాలతో పాటు తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా మరో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక RRR సినిమా 40రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉందని చెప్పాడు. అయితే తారక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇటీవల కాలంలో వచ్చిన రూమర్స్ లో వాస్తవం లేదని అర్ధమవుతోంది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా ఉంటుందని ఇప్పటికే తారక్ కు కథ కూడా వినిపించినట్లు టాక్ వచ్చింది.

నిజానికి బుచ్చిబాబుకు వర్క్ చేయాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజిగా ఉండడం వల్ల కామిట్మెంట్ ఇచ్చే ఆలోచనలో లేకపోవచ్చు. మరి భవిష్యత్తులో అయినా తారక్ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus