గత పదేళ్లుగా ప్రతి జూలైకి ఓ పెద్ద బ్లాక్ బస్టర్ పడటం ఆనవాయితీగా వస్తుంది. 2014 లో ‘దృశ్యం’ (Drushyam) , 2015 లో ‘బాహుబలి'(ది బిగినింగ్) (Baahubali) , 2016 లో ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) , 2017 లో ‘ఫిదా’ (Fidaa), 2018 లో ‘ఆర్.ఎక్స్.100’, 2019 లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) , 2020 (థియేటర్లు క్లోజ్ అయ్యాయి), 2021 లో కూడా దాదాపు అదే పరిస్థితి. అయితే 2022 లో ‘విక్రాంత్ రోణా’, 2023 లో ‘బేబీ’ (Baby) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు జూలై నెలలో రావడం గమనార్హం.
అయితే ఈ ఏడాది జూలై నెలలో ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా కూడా పడలేదు. ధనుష్ (Dhanush) ‘రాయన్'(Raayan) సినిమా పర్వాలేదు అనిపించింది కానీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఈ ఏడాది జూలైలో (2024) చూసుకుంటే..’సారంగధరియా’ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ‘డార్లింగ్’ (Darling) ‘ఆపరేషన్ రావణ్’ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యి దారుణంగా ప్లాప్ అయ్యాయి. ‘పేక మేడలు’ (Pekamedalu) సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా… దానికి టికెట్ రేట్లు తగ్గించినా, మినిమమ్ ఓపెనింగ్స్ కూడా దానికి రాలేదు.
జూలై నెలలో కూడా ప్రేక్షకులకి ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. పెద్ద సినిమాలు లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే ఆలోచనే పెట్టుకోవడం లేదు. టికెట్ రేట్లు తగ్గించినా.. స్నాక్స్ ఫ్రీ అంటూ వేరే భాషల్లో ఏవేవో స్ట్రాటజీలు ప్లే చేసినా సరే.. బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు.