Kalki 2898 AD: ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్న కల్కి టీమ్.. కానీ?
- July 31, 2024 / 07:03 PM ISTByFilmy Focus
ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంది. అమితాబ్ (Amitabh Bachchan) పోషించిన అశ్వథ్థామ పాత్ర ప్రభాస్ పోషించిన భైరవ పాత్రలకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే కల్కి టీమ్ సర్ప్రైజ్ గురించి అమితాబ్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కల్కి టీమ్ కొంతమందితో కలిసి ఒక షో ప్లాన్ చేస్తోందని అందుకోసం ఇప్పటికే వర్క్ మొదలైందని అమితాబ్ వెల్లడించారు.
నేను కూడా ఈ షో కోసం పని చేస్తున్నానని అమితాబ్ అన్నారు. దయచేసి ఈ పోస్ట్ ను ఆహ్వానంగా భావించవద్దని ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నం ఫలించొచ్చని విఫలమవ్వొచ్చని లవ్ యూ ఆల్ అంటూ అమితాబ్ పేర్కొన్నారు. కల్కి 2898 ఏడీ సినిమాకు ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇతిహాసాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో మెప్పించింది.

కల్కి 2898 ఏడీ సినిమాలో గెస్ట్ రోల్స్ సైతం ప్రేక్షకులను మెప్పించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కల్కి సినిమా క్లైమాక్స్ అభిమానులను ఎంతగానో నచ్చింది. ప్రభాస్ పాత్రకు సంబంధించి వచ్చిన ట్విస్టులు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించాయి. ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
కల్కి 2898 ఏడీ సినిమా ప్రభాస్ కెరీర్ లో మెమొరబుల్ మూవీగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.















