Devara: ఆ సీన్ లో తారక్ నటన మైండ్ బ్లోయింగ్.. దేవర సీక్రెట్స్ రివీల్ అయ్యాయిగా!

  • May 25, 2024 / 12:45 PM IST

దేవర (Devara) సినిమా రిలీజ్ కు మరో 4 నెలల సమయం ఉంది. ఫస్ట్ సింగిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కాగా త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం చాలామంది ప్రముఖ నటీనటులు పని చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు పని చేస్తున్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమా స్టోరీ లైన్, ఇతర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని ఊర్లకు దేవర కాపరి అని ఆ ఊరి ప్రజలకు సపోర్ట్ గా ఉండటంతో పాటు వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతాడని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. సినిమాలో 10,000 మందితో సముద్రం దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుందని సముద్రమంతా రక్తంతో నిండిపోయే ఆ సీన్ వేరే లెవెల్ లో ఉంటుందని ఆ జూనియర్ ఆర్టిస్ట్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని ఆ నటుడు కామెంట్లు చేశారు.

తారక్ సింగిల్ టేక్ లోనే సీన్లను పూర్తి చేస్తాడని దేవర అభిమానులకు కచ్చితంగా నచ్చేలా ఉంటుందని ఆ నటుడు వెల్లడించారు. అయితే దేవర స్టోరీ లైన్, సీక్రెట్స్ రివీల్ కావడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రాకుండా చూసుకోవాలని మేకర్స్ ను ఫ్యాన్స్ కోరుతున్నారు. మేకర్స్ సైతం ఆ జూనియర్ ఆర్టిస్ట్ కామెంట్లు చేసిన వీడియోలను డిలీట్ చేయించినట్టు తెలుస్తోంది.

అయితే 10,000 మందితో యాక్షన్ సీన్ అంటే నమ్మలేని విధంగా ఉందని కొంతమంది చెబుతున్నారు. వైరల్ అవుతున్న అప్ డేట్ నిజమో కాదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దేవర సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతుండగా సినిమా రిలీజ్ సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus