ప్రముఖ బిజినెస్మెన్, మంత్రి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి డెబ్యూ మూవీ ‘జూనియర్’ జూలై 18న రిలీజ్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా రీ- ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరో అక్క పాత్రలో ఆమె నటించడం విశేషంగా చెప్పుకోవాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ‘వైరల్ వయ్యారి’ పాట బాగా వైరల్ అవ్వడం వల్ల ఈ సినిమాకి పబ్లిసిటీ జరిగింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నెగిటివ్ టాక్ రాబట్టుకున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి.
కానీ వీక్ డేస్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.0 cr |
సీడెడ్ | 0.23 cr |
ఆంధ్ర | 1.30 cr |
ఏపీ+తెలంగాణ | 2.53 cr |
కర్ణాటక | 1.04 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.54 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.11 cr |
‘జూనియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.4.11 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో ఈ సినిమా బాగా డౌన్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. మళ్ళీ గ్రోత్ చూపిస్తే తప్ప సాధ్యం కాదు అనే చెప్పాలి.