Jyothika: వైరల్ అవుతున్న హీరోయిన్ జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో జ్యోతికకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో జ్యోతిక (Jyothika) ఎక్కువగా నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చాలా రోజుల నుంచి నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. అందుకే నా సినిమాలలో వేరే హీరో కావాలని అనుకోవడం లేదని జ్యోతిక చెప్పుకొచ్చారు. మంచి కథ ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో సూర్యతో (Suriya) కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె కామెంట్లు చేశారు.

ఇప్పటివరకు నేను చేసిన హీరోలంటే నాకు ఎంతో గౌరవం అని జ్యోతిక పేర్కొన్నారు. రజనీకాంత్ (Rajinikanth) సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో అని విజయ్ స్థిరత్వం ఉన్న నటుడని ఆమె కామెంట్లు చేశారు. సినిమా బాగా రావడం కోసం మమ్ముట్టి ఎంతైనా కష్టపడతారని జ్యోతిక వెల్లడించడం గమనార్హం. సూర్య గురించి జ్యోతిక మాట్లాడుతూ సూర్య అందరినీ గౌరవిస్తారని తెలిపారు. సూర్య అందరి కోసం టైమ్ కేటాయిస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.

సూర్యలో ఈ విషయం బాగా నచ్చుతుందని సూర్యకు సహనం ఎక్కువని సూర్య స్నేహానికి ఎంతో విలువ ఇస్తాడని జ్యోతిక పేర్కొన్నారు. సూర్య అవతలి వ్యక్తి మాట్లాడేది ఓపికగా వింటాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో నేను ఎక్కువగా మాట్లాడతానని సూర్య వింటూ ఉంటాడని జ్యోతిక తెలిపారు. సూర్య దేన్నైనా తట్టుకోగలడని సూర్యలో నచ్చని విషయం ఏంటంటే బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని ఆమె కామెంట్లు చేశారు.

ప్రతిరోజూ ఉదయం సమయంలో మా ఇద్దరికీ ఈ విషయంలో గొడవలు జరుగుతాయని జ్యోతిక పేర్కొన్నారు. ప్రస్తుతం షైతాన్ ప్రమోషన్స్ తో జ్యోతిక బిజీగా ఉండగా ఈ సినిమాతో ఆమెకు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సూర్య, జ్యోతిక కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus