తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతిక ఒకరు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించినటువంటి ఈమె 2006వ సంవత్సరంలో నటుడు సూర్యుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అయితే ఈ పిల్లలు ప్రస్తుతం పెద్దయి ఉన్నత చదువులు చదువుతున్నటువంటి తరుణంలో ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే జ్యోతిక (Jyothika) కోలీవుడ్ సినిమాలలో బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి పలు విషయాలను తెలిపారు. ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సినిమాలను కొత్త దర్శకులు మాత్రమే దర్శకత్వం వహిస్తున్నారు. పెద్ద దర్శకులు లేడి ఓరియంటెడ్ సినిమాలను చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని జ్యోతిక తెలిపారు.
స్టార్ డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలను చేయడానికి ఇష్టపడుతున్నారని ఈమె తెలిపారు. నిజం చెప్పాలి అంటే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా కోసం హీరోల కంటే హీరోయిన్లే 10 శాతం ఎక్కువగా కష్టపడుతున్నారని ఈమె తెలిపారు. ఇలా హీరోయిన్స్ ఎక్కువగా కష్టపడుతున్నప్పటికీ హీరోలని ఎక్కువగా మోసేస్తున్నారని, ఇలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏంటి అంటూ ఈ సందర్భంగా జ్యోతిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.