ధమాకా ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్!

రవితేజ హీరోగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా త్రినాథ్ రావు దర్శకత్వంలో పీపుల్ ఆర్ట్స్ మీడియా బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రవితేజ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను అల్లరి ప్రియుడు సినిమా షూటింగ్ సమయంలో రవితేజ ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆర్కెస్ట్రా గ్రూపులో రవితేజ డ్రమ్స్ వాయించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రవితేజను చూసి తాను భవిష్యత్తులో ఒక మాస్ హీరో అవుతాడని

ఆ రోజే ఊహించాను అంటూ ఈ సందర్భంగా రాఘవేంద్రరావు రవితేజ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక శ్రీ లీల గురించి కూడా మాట్లాడుతూ ఈమె పెళ్లి సందడి సినిమాలో ఫ్లూట్ వాయించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచిందని తెలిపారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ధమాకా సినిమా కాసుల వర్షం కురిపించాలని ఈ సందర్భంగా చిత్ర బృందానికి రాఘవేంద్రరావు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.

త్వరలోనే రవితేజ కొడుకు కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు తెలియజేశారు.అయితే ఇదివరకే రవితేజ కుమారుడు ఆయన హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో నటించిన సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus