K-Ramp Review in Telugu: K ర్యాంప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కిరణ్ అబ్బవరం (Hero)
  • యుక్తి తరేజా (Heroine)
  • సాయికుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, ఆదిత్య మండాల, వెన్నెల కిషోర్ తదితరులు (Cast)
  • జైన్స్ నాని (Director)
  • రాజేష్ దండా & శివ బొమ్మకు (Producer)
  • చైతన్ భరద్వాజ్ (Music)
  • సతీష్ రెడ్డి మాసం (Cinematography)
  • ఛోటా కె ప్రసాద్ (Editor)
  • Release Date : అక్టోబర్ 18, 2025
  • హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ (Banner)

కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్”. ఈ దీపావళికి మంచి ఎనర్జిటిక్ కంటెంట్ తో ఆడియన్స్ కి ముందుకు వచ్చాడు కిరణ్. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం దివాళీ రేస్ లో కాస్త గట్టిగానే నిలబడింది. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? కిరణ్ దివాళీ మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగాడా? అనేది చూద్దాం..!!

K-Ramp Movie Review

కథ: చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో.. ఒక్కగానొక్క కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం)ను అల్లారుముద్దుగా పెంచుతాడు తండ్రి (సాయికుమార్). బీభత్సమైన రిచ్ అయినప్పటికీ.. చాలా చిల్లరగా బిహేవ్ చేస్తుంటాడు. కొడుకు అల్లరి తగ్గించడం కోసం కేరళలోని ఓ కాలేజ్ లో డొనేషన్ సీట్ కొని మరీ అక్కడికి పంపిస్తాడు.

కేరళ వచ్చిన కుమార్ కొన్నాళ్లు అక్కడ ఎంజాయ్ చేసి.. ఫస్ట్ మీటింగ్ లోనే మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ను ప్రేమిస్తాడు. అయితే.. మెర్సీకి ఉన్న ఒక సమస్య కుమార్ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.

మెర్సీకి ఉన్న సమస్య ఏమిటి? దాన్నుంచి కుమార్ ఎలా బయటపడ్డాడు? అనేది “K-ర్యాంప్” సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు: కిరణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా అతడి బాడీలో ఈజ్ కనిపించింది. కొన్ని బూతులు అనవసరం అనిపించాయి. అయితే.. టైమింగ్ విషయంలో మాత్రం బాగా ఇంప్రూవ్ అయ్యాడు కిరణ్. కాకపోతే.. నటుడిగా అతనికి మేకోవర్ అవసరం. లేకపోతే ఒక స్టార్ హీరోగా ఎదగడానికి ఇబ్బందిపడతాడు. హీరోయిన్ కారణంగా ఇబ్బందిపడే సన్నివేశాల్లో అతడి పాత్ర ఇబ్బందుల్ని ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

యుక్తి తరేజా పాత్రకి మంచి ఆర్క్ ఉంది. అయితే.. ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్న క్లారిటీ పే ఆఫ్ లో లేకపోవడం వల్ల ఆ పాత్రకి జస్టిఫికేషన్ లేకుండాపోయింది. అయితే.. ఆమె గ్లామర్ సినిమాకి సెల్లింగ్ పాయింట్ గా నిలిచింది అనే చెప్పాలి. ముద్దు సీన్లలో ఎక్కడా బోర్డర్ దాటకుండా చూసుకోవడంతో అవి అంతగా ఇబ్బందిపెట్టవు.

సినిమా మొత్తానికి చిరాకు పెట్టి, పచ్చిగా చెప్పాలంటే జుగుప్స కలిగించే పాత్ర నరేష్ ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నరేష్ ఇంతకుమించిన బోల్డ్ సీన్స్ “గుంటూరు టాకీస్”లోనే చేసేశాడు. బాత్రూం బయట పిల్లలు అల్లరి చేస్తుండగా.. శృంగార పుస్తకం చదువుతూ స్కలనం కోసం పరితపిస్తుంటాడు నరేష్. ఆ సన్నివేశానికి మించిన బోల్డ్ నరేష్ కూడా మళ్లీ చేయలేదు. అలాంటిది.. ఈ సినిమాలో “మొహం మీద గుడ్డ వేసి….” అంటూ నరేష్ తో చెప్పించి డైలాగ్ సినిమాకి డ్యామేజ్ చేయడమే కాక.. ఫ్యామిలీ ఆడియన్స్ అసహ్యించుకునేలా ఉంది. నరేష్ తానేదో బోల్డ్ రోల్స్ చేస్తున్నాను, యూత్ ఫుల్ గా ఉంటున్నాను అనే భ్రమలో ఇలాంటి జుగుప్సాకరమైన డైలాగులు చెప్పడం అనేది ఆయన స్థాయికి తగినది కాదు.

సాయికుమార్ డబ్బున్న తండ్రి పాత్రలో, మురళీధర్ గౌడ్ బాబాయ్ క్యారెక్టర్లో తమ సీనియారిటీతో నెట్టుకొచ్చేశారు. హీరో ఫ్రెండ్ గా ఆదిత్య మండాల మంచి స్క్రీన్ ప్రెజన్స్ & టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ ఒక ఎపిసోడ్ కోసం అలా కనిపించి మాయమయ్యాడు.

సాంకేతికవర్గం పనితీరు: చైతన్ భరద్వాజ్ 100% న్యాయం చేశాడు. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎనర్జీ ఇచ్చాయి. సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమా బడ్జెట్ కి న్యాయం చేశాడాయన. ఆర్ట్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, డి.ఐ టీమ్స్ వంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తమ బెస్ట్ ఇచ్చాయి.

దర్శకుడు జైన్స్ నాని ఒక సింపుల్ కథను, ఎనర్జిటిక్ గా చెప్పాలనుకున్నాడు. కొంతమేరకు సక్సెస్ అయ్యాడు కూడా. కానీ.. నరేష్ క్యారెక్టర్ ను డీల్ చేసిన విధానం, ఆ పాత్రకు చెప్పించిన డైలాగుల విషయంలో కాస్త విలువలు పాటించి ఉంటే బాగుండేది. ఈవీవీగారు కూడా ఈ తరహా డైలాగ్ ను “కితకితలు” సినిమాలో వాడారు. కాకపోతే ఆయన బోర్డర్ దాటకుండా లైట్ ఆఫ్ చేసాక అందరి పెళ్ళాలు ఐశ్వర్య రాయ్ లే అన్నాడు. అందులో ఒకరు ఇబ్బందిపడేంత తప్పేమీ లేదు. కానీ.. నరేష్ తో చెప్పించిన ఆ ఒక్క డైలాగ్ మాత్రం చాలా హేయంగా ఉంది. అలాగే.. ఆ సెకండాఫ్లో వచ్చే కామ్నా జెట్మలాని ఎపిసోడ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ల కాంబినేషన్ కంటే నరేష్ తన కొడుకు పాత్ర కిషోర్ కి ఎందుకు ట్రై చేస్తున్నాడు అని వివరించే విధానం ఇంకా అసహ్యంగా ఉంది. ఇది మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది అని అనుకుంటే మాత్రం దర్శకుడిగా, రచయితగా, వ్యక్తిగా అతడి ఆలోచనాధోరణి ఎంతలా దిగజారింది అనుకోవడమే తప్ప ఏమీ చేయలేం.

ఈ అపహాస్యాన్ని పక్కన పెడితే.. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ను బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే.. క్లైమాక్స్ లో ఇచ్చే జస్టిఫికేషన్ మాత్రం కన్విన్సింగ్ గా లేదు. ఈ రెండు విషయాల్లో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే దర్శకుడిగా నానికి ఇది మంచి డెబ్యూ అయ్యేది.

విశ్లేషణ: ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే.. ఇబ్బందిపట్టే హాస్యం కూడా ఉంది. ఈ దివాళికి “డ్యూడ్” తర్వాత సెకండ్ ఆప్షన్ గా “K-ర్యాంప్” ఉంటుంది అని చెప్పొచ్చు.

ఫోకస్ పాయింట్: సెన్స్ లెస్ మాస్ మసాలా మూవీ!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus