KA Collections: ‘క’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)  కొత్త సినిమా ‘క’ (KA)దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 3 సినిమాలతో పోటీ పడి మరీ తక్కువ థియేటర్లు మాత్రమే దొరికినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద చాలా బాగా కలెక్ట్ చేసింది. సుజీత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత వీక్ డేస్లోనూ, రెండో వీకెండ్లోనూ అద్భుతంగా కలెక్ట్ చేసింది ఈ సినిమా.

KA Collections:

ఇక ‘క’ 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.84 cr
సీడెడ్ 2.51 cr
ఉత్తరాంధ్ర 2.20 cr
ఈస్ట్ 0.57 cr
వెస్ట్ 0.43 cr
గుంటూరు 0.59 cr
కృష్ణా 0.81 cr
నెల్లూరు 0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.79 cr
ఓవర్సీస్ 2.66 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.70 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.15.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.11.2 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది.

‘అమరన్’.. 11 రోజుల కలెక్షన్స్..లాభం ఎంత?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus