KA Collections: భారీ లాభాల దిశగా ‘క’..!

వరుస ప్లాపుల్లో ఉన్న హీరో కిరణ్ అబ్బవరంకి (Kiran Abbavaram) ‘క’ (KA) మంచి సక్సెస్ అందించింది అని చెప్పాలి. సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి(C. H. Gopalakrishna Reddy) నిర్మించారు. నయన్ సారిక (Nayan Sarika)  హీరోయిన్ గా నటించగా తన్వీ రామ్ (Tanvi Ram) కీలక పాత్ర పోషించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

KA Collections:

2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం మూడో రోజు కూడా కుమ్మేసింది. ఒకసారి (KA) 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.25 cr
సీడెడ్ 1.09 cr
ఉత్తరాంధ్ర 1.18 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.30 cr
కృష్ణా 0.39 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 cr
ఓవర్సీస్ 1.62 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.82 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 3 రోజులు పూర్తయ్యేసరికి రూ.7.82 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.3.32 కోట్ల లాభాలు అందించింది ‘క’. ఆదివారం కూడా ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus