KA Review: కిరణ్ అబ్బవరం ‘క’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా అంటే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే సినిమానే అని చెప్పాలి. గతేడాది వరకు వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన అతను.. ఏడాది గ్యాప్ తీసుకుని ‘క’ (KA) అనే సినిమా చేశాడు. సుజీత్, సందీప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. నయన్ సారిక (Nayan Sarika) , తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.

KA Review

‘క’ టీజర్, ట్రైలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా వుండబోతుందనే ఫీలింగ్ ని కలిగించాయి. అలాగే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయేమో అనిపిస్తున్నాయి. ప్రామిసింగ్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది వీక్షించారు.

వారి టాక్ ప్రకారం.. ఒక ఊరు అక్కడ 3 గంటలకే చీకటి పడిపోవడం.. ఆ టైంలో జరిగే ఊహించని సంఘటనలు చాలా గ్రిప్పింగ్ గా అనిపిస్తాయట. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అని అంటున్నారు. చివరి 30 నిమిషాలు ఊహించని విధంగా ‘క’ ఉంటుందని.. సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ‘క’ నచ్చుతుందని అంటున్నారు.

సామ్ సి ఎస్ (Sam C. S.) అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంటుందట. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చిందని, నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించిందని అంటున్నారు. మొత్తంగా ‘క’ లో కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపించాడట. నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడట. అతని ఖాతాలో ఇంకో హిట్ పడినట్టే అంటున్నారు. చూడాలి మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus