ఒక రెండ్రోజుల క్రితం వరకూ “కాలా”కి పెద్దగా బజ్ లేదు అంటే ప్రమోషన్స్ సరిగా లేవు కాబోలు అనుకోవచ్చు. కానీ.. సాక్ష్యాత్తు రజనీకాంత్ స్వయంగా హైద్రాబాద్ వచ్చి మరీ “కాలా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది” అంటూ ప్రమోట్ చేస్తున్నా ఎవడూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా.. రేపు సినిమా విడుదలవుతున్నా మల్టీప్లెక్స్ తప్ప సింగిల్ స్క్రీన్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రీబుకింగ్స్ అవ్వలేదు. మల్టీప్లెక్స్ లలో కూడా కేవలం 40% బుకింగ్స్ మాత్రమే అయ్యాయి.
దాంతో.. తెలుగులో “కాలా” సినిమా అనువాద హక్కుల్ని 25 కోట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. దరిదాపుల్లో మరో పెద్ద సినిమా లేకపోయినా కూడా రజనీకాంత్ సినిమా విషయంలో ఈస్థాయిలో భయపడడం ఇదే మొదటిసారేమో. వీళ్ళ టెన్షన్ చూస్తుంటే.. “కాలా” సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ అయినా వస్తాయో రావో అని భయపడుతున్నారు. రజనీ సరసన హ్యూమా ఖురేషీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు ధనుష్ నిర్మించడం విశేషం.