2 .౦ కంటే ముందే కాలా రిలీజ్ ?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమర్షియల్ డైరక్టర్ శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మరో కళాఖండం 2 .o. సంచలనం సృష్టించిన ‘రోబో’ సినిమాకి ఇది సీక్వెల్ . బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 450 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ముంబయిలో, ఆడియోను అబుదబిలో విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ అనుకున్నారు. అయితే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో మరో సారి రిలీజ్ వాయిదా పడుతోందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

అయితే పా.రంజత్‌ దర్శకత్వంలో రజినీ నటించిన కాలా మూవీ మాత్రం అనుకున్న దానికంటే వేగంగా సిద్ధమవుతోంది. ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. తన పాత్రకి రజనీ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమాని 2 .o కంటే ముందుగానే రిలీజ్ చేయాలనీ చిత్రం బృందం భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. వేసవి సీజన్ కన్నా మించిన అనువైన సీజన్ లేదు కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే కలక్షన్స్ బాగా వస్తాయని ధనుష్ సన్నాహాలు మొదలెట్టినట్లు సమాచారం. సో 2 .౦ కంటే ముందే కాలా రిలీజ్ అయి రికార్డులు సృష్టించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus