దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కాంత’ అనే సినిమా రూపొందింది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిలతో కలిసి ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ వదిలారు. ‘కాంత’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఒక కథ ఎప్పుడూ చెప్పాలని.. ఆ కథేరా నిర్ణయిస్తుంది’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
‘మోడ్రన్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. కాదు ఒప్పించాను’ అంటూ దర్శకుడిగా చేస్తున్న సముద్రఖని అవకాశాల్లేని ఓ హీరో కమ్ నటుడితో(దుల్కర్ సల్మాన్) తో మాట్లాడటాన్ని మనం గమనించవచ్చు. ఆ సినిమాతో టాప్ ప్లేస్ కి చేరుకున్న ఆ హీరో.. తర్వాత లైఫ్ ఇచ్చిన దర్శకుడిని పక్కన పెట్టడం. సినిమా చేయాల్సి వచ్చినప్పుడు హీరో తన అహాన్ని దర్శకుడిపై చూపించడం.. ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణే ‘కాంత’ మిగిలిన కథగా ట్రైలర్ ను కట్ చేశారు.

రానా దగ్గుబాటి కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేతో పాటు రవీంద్ర విజయ్ వంటి నటులు కూడా ట్రైలర్లో కనిపించారు. ఈ ట్రైలర్ లో టెక్నికల్ అంశాలు బాగున్నాయి కానీ కథ కానీ, అందులో ఉన్న డెప్త్ కానీ సినిమా చూడాలనే ఆసక్తిని క్రియేట్ చేయలేదు. అలాగే కొన్ని పాత యాడ్స్ చూసిన ఫీలింగ్ ను ఇస్తాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:
