చిన్న, సంధ్య దయన్, ముఖ్య పాత్రల్లో కొప్పుల అశ్విని కుమార్రాజ్ దర్శకత్వంలో నంది కె రెడ్డి నిర్మించిన చిత్రం కాశీ వస్ లవ్. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అగస్ట్ 15న ఊర్వశి ఓటిటి లో విడుదలైంది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత నంది కె రెడ్డి మాట్లాడుతూ ..లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా ఓ భిన్నమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి లో ఆగస్టు 15న విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు అశ్విని కుమార్రాజ్ మాట్లాడుతూ .. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలు చూసాం .. కానీ సరికొత్త తరహా ప్రేమ కథగా తెరకెక్కించాం. హీరో,హీరోయిన్స్ తో పాటు ఈ టీం అంతా కొత్తవారే. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ప్రేమికుడికి నచ్చుతుంది. ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి లో విడుదల చేయడం హ్యాపీగా ఉంది అన్నారు. చిన్న, సంధ్యా దయాన్, కిరణ్ కుమార్,మాచిరు మారెప్ప, సిరి, రెడ్డప్ప, లక్ష్మి రేఖ, కోటకొండ మురళి తదితరులు
ఈ చిత్రానికి సంగీతం : కృష్ణ, పాటలు : సతీష్ జె , బి. జీ దశరధ్, కెమెరా : గౌరీ శంకర్ , ఎడిటింగ్ : మహేంద్ర నాధ్, కుమార్, నిర్మాత : నంది కె రెడ్డి, దర్శకత్వం : కొప్పుల అశ్విని కుమార్రాజ్,
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!