రజనీతో పోటీకి దిగనున్న విక్రమ్!
- May 18, 2016 / 10:54 AM ISTByFilmy Focus
రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే.. తమిళనాడులోనే కాదు తెలుగులోనూ తమ సినిమాను విడుదల తేదీకి ఒక వారం ముందు లేక తర్వాత విడుదల చేయడానికి ఎంతటి స్టార్ హీరో అయినా ముందుకురాడు. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మార్పు కనబడుతోంది.
రజనీ “కబాలి” జూలై 1న విడుదలవుతుండగా.. అదే తేదీన వెంకటేష్ “బాబు బంగారం” విడుదల కానుండగా, విక్రమ్ కూడా తన తాజా చిత్రం “ఇరుముగన్”ను అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడట.
మరి ఆలిండియా సూపర్ స్టార్ కు ఎదురు నిలుస్తున్న ఈ ఇద్దరు తెలుగు హీరోలు (విక్రమ్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగువాడే) నెగ్గుకురాగలరో లేదో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















