మరోసారి వాయిదా పడ్డ ‘కబాలి’..!

సూపర్ స్టార్ రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కబాలి’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట తమిళ సంవత్సరాదిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 న విడుదల చేయాలని భావించినప్పటికీ.. తమిళనాట ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రజినీ వాయిదా వేయించారు. ఈ చిత్రం మే నెలాఖరున విడుదల చేయాలని భావించినప్పటికీ..  ఈ చిత్రం మరోసారి వాయిదా పడిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూన్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే జంటగా నటిస్తుండగా.. ధన్సిక రజినీ కూతురుగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణ్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus