కబాలి టాక్ ముందే బయట పడనుంది?

  • July 21, 2016 / 10:49 AM IST

కబాలి…కబాలి..కబాలి….ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎవ్వరి నోట విన్నా..ఇదే మాట…రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి దాదాపు 60దేశాలు. దాదాపుగా 5 బాషల్లో విడుదల కాబోతున్న ఈ కబాలి సినిమాపై అంచనాలు బారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మన దేశంలో రేపు విడుదల కాబోతుంది. కానీ ఈ సినిమా టాక్ మాత్రం ఈరోజే తెలియబోతుంది అన్న విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది. విషయంలోకి వెళితే…మన టాప్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోస్ అంటూ ఆ సినిమా విడుదలయ్యే కొద్ది గంటల ముందు అభిమానుల కోసం వేస్తూ ఉంటారు. అయితే ‘కబాలి’ విషయంలో మరీ ముందుగా షోలు పడిపోతున్నాయి.

అయితే అది మన దేశంలో కాదు కంగారు పడకండి…..ఇతర దేశాల్లో …మన భారత కాలమానం ప్రకారం అమెరికాలోని చాల ప్రాంతాలలో ఈరోజు ‘కబాలి’ ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. ‘కబాలి’ మీద అభిమానులకు ఉన్న ఆశక్తితో ఈరోజు సాయంత్రానికి సోషల్ మీడియా ద్వారా ‘కబాలి’ టాక్ ఏమిటి అన్నదితెలియబోతోంది. రేపటి మన విడుదలకు ముందే మనకు సినిమా ఎలా ఉంది అన్న వార్త బయటపడిపోతుంది. మరి అందరూ ఊహించినట్లుగా కబాలి అంచనాలను అందుకుంటుందా….లేదా అనేది మరి కొన్ని గంటల్లో తెలియబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus