ప్రతి మనసుకు నచ్చే ‘కాదల్’
- April 7, 2017 / 07:13 AM ISTByFilmy Focus
ప్రేమకు ఎన్నోరూపాలే కాదు.. ఎన్నో భాషలున్నాయి. అలా ప్రేమకు మరో పేరే కాదల్. ఇది తమిళ పదం అయినప్పటికీ ప్రేమ కదా… అందరికీ అర్థమయిపోతుంది. యువ దర్శకుడు కౌశిక్ ఒక స్వీట్ ప్రేమ కథను కాదల్ పేరుతో లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత అది పెళ్లి తీరం చేరుతుందో, చేరదో ఎవరూ కరక్ట్ గా చెప్పలేము. ప్రేమ విజయం సాధించినప్పుడు ఆనందం కలగడం ఎంత సహజమో.. చివరి నిముషంలో ప్రేమకు దూరమయినప్పుడూ బాధ కలగడం అంతే సహజం.
ఆ బాధను కూడా ప్రేమలో భాగంగా భావిస్తే లైఫ్ లో ఆ కొన్ని రోజులు కూడా మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని డైరక్టర్ కాదల్ లఘుచిత్రంలో చెప్పడానికి ప్రయత్నించారు. రొటీన్ ప్రేమకథలు చూసి బోర్ కొట్టిన వారికి కాదల్ గొప్ప రిలీఫ్ ని ఇస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














