మనసులోని మాటను బయటపెట్టిన కాజల్!
- September 8, 2017 / 11:09 AM ISTByFilmy Focus
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. నాలుగైదేళ్లకే నటీమణులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. అటువంటిది ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్ 12 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. తేజ దర్శకత్వంలో లక్ష్మీకళ్యాణంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్.. ఆ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ చందమామ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన మగధీరలో మిత్రవిందగా మెప్పించి టాలీవుడ్ యువరాణి కిరీటం అందుకుంది. చరణ్ ఏజ్ గ్రూప్ హీరోలతో నటించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవితోను నటించి హిట్ అందుకుంది.
తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ పేరు అందుకుంది. ఇలా ఇప్పటి వరకు 49 సినిమాలను పూర్తిచేసుకుంది. తొలిహీరో కళ్యాణ్ రామ్ తో తన 50 వ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు M L A (మంచి లక్షణాలున్న అబ్బాయి). ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. యాభై చిత్రాలు పూర్తి చేసుకున్నారుకదా.. నటనకు బై బై చెప్పి పెళ్లి చేసుకుంటారా? అని విలేకరులు కాజల్ ని అడగగా.. ఆమె స్పందిస్తూ “నాకు పరిశ్రమకు వచ్చి రెండు మూడేళ్లు అయినట్టు అనిపిస్తోంది. నాకు వంద సినిమాలు చేయాలనీ ఉంది.” అని వివరించింది. కాజల్ కి ఉన్న ఆదరణ చూస్తుంటే ఆమె కల నెరవేరేటట్టే ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













