టాలీవుడ్ లో కాజల్ దాదాపు ఓ 13 ఏళ్ళ కెరీర్ కలిగివుంది. 2007లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం మూవీతో డైరెక్టర్ తేజ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఫేడ్ అవుట్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో రాజమౌళి మగధీర కోసం తీసుకొని కెరీర్ కి ఫ్యూయల్ అందించాడు. ఆ సక్సెస్ ఆమెని స్టార్ హీరోయిన్ ని చేసింది. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా కొనసాగింది. కోటి వరకు ఆమె రెమ్యూనరేషన్ తీసుకుంది. అలాంటి కాజల్ అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు కష్టం వస్తే కనీసం స్పందించలేదు. చాలా తక్కువ స్థాయి నటులు తమ వంతు సాయం చేస్తున్నా కనీసం ఇటు వైపు నిక్కి చూడలేదు.
చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసిస్ ఛారిటీకి ఆమె నుండి ఒక్క రూపాయి విరాళం రాలేదు. లేటైనా ఇస్తారులే అని ఎదురుచూసిన చిరంజీవికి చిర్రెత్తి పర్సనల్ గా కాల్స్ చేసి మరీ ఈ విషయంపై సీరియస్ అయ్యారట. మరి ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ, నేడు కాజల్ 2 లక్షల రూపాయలు కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విరాళం ఎదో ముందే చేస్తే గౌరవంగా ఉండేది. గట్టిగా అడగడం వలన నిర్భదంతో ఇవ్వడం దానం అనిపించుకోదు.
కాజల్ ఈ రెండు లక్షలు ఎంతో బాధపడుతూ ఇచ్చి ఉంటుందని అర్థం అవుతుంది. ఒక సినిమా తెరకెక్కాలంటే అనేక మంది కార్మికులు పని చేయాల్సి వస్తుంది. వారు లేకపోతే సినిమా నిర్మించలేరు. పరోక్షంగా స్టార్స్ అభివృద్ధిలో వారి మద్దతు కూడా ఉన్నట్లే. మరి అలాంటి పేద సినీ కార్మికుల కోసం చేసే సాయంలో మీన మేషాలు లెక్కించడం సబబు కాదు. కాజల్ ఇప్పటికైనా తన గౌరవం నిలుపుకుంది. ఇంకొంతమంది స్టార్ హీరోయిన్స్ అలాగే వేడుక చుస్తున్నారు. వాళ్ళకెప్పుడు చలనం కలుగుతుందో?