అందం, అభినయం కలిసిన బ్యూటీ కాజల్ అగర్వాల్. పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్నా మరింత అందంతో అవకాశాలను అందుకుంటోంది. తెలుగులోనే కాదు దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ లో ఒకరిగా పేరుతెచ్చుకుంది. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా ఈ మధ్య బాగానే డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా పారితోషకం తగ్గించుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే తన గాడ్ ఫాదర్ తేజ అని తెలిసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన “లక్ష్మి కళ్యాణం” చిత్రం తో తెలుగులో పరిచయమయింది. ఆ తర్వాత వెనుతిరగలేదు.
వరుసగా హిట్స్ అందుకొని టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అయినా తనకి తొలి అవకాశాన్ని ఇచ్చిన తేజాన్ని మరిచిపోలేదు. తేజ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అడగగ్గానే నేనే రాజు నేనే మంత్రి సినిమాకోసం కేటాయించింది. ఇప్పుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నంచి బయటికి వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పింది. అంతేకాదు పారితోషికం తగ్గించుకోమని కోరగానే గురువుగారి సినిమాకోసం తగ్గించుకోవడానికి తీసుకుంది. ఈ విషయం టాలీవుడ్ మొత్తం వ్యాపించడంతో కాజల్ ని అందరూ అభినందిస్తున్నారు.