తెలుగు చిత్ర పరిశ్రమకి క్లీన్ చిట్ ఇచ్చిన కాజల్

చిత్ర పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని జూనియర్, సీనియర్ హీరోయిన్లు వాపోతుంటే కాజల్ అగర్వాల్ మాత్రం లేదని క్లీన్ చిట్ ఇచ్చేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన బ్యూటీ తక్కువ సినిమాలతోనే తెలుగువారికి దగ్గరయింది. అనేక ఘనవిజయాలు సొంతంచేసుకొని టాలీవుడ్ యువరాణిగా పేరు దక్కించుకుంది. తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఈ భామ ముందు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించగా… టాలీవుడ్ లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విషయమే తనకు తెలియదని చెప్పింది. “ఆ విషయంలో నేను చాలా లక్కీ. నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాల్లేవు. అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో కూడా నాకు తెలీదు.”

అంటూ కాజల్ వెల్లడించింది. రీసెంట్ గా వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పింది. తనకు అనుభవం ఎదురుకాలేదని వెల్లడించి విమర్శలను ఎదుర్కొంది. కాజల్ దాదాపు 12 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది. ఇలాంటి సీనియర్ హీరోయిన్ కూడా ఇలా అనడంఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు ఈ విషయంపై కాజల్ సలహాలు కూడా ఇస్తోంది. “కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఒకటి మాత్రం చెప్పగలను. అమ్మాయిల్ని సేఫ్ గా ఉండమని చెప్పేకంటే, మగాళ్లు మరింత రెస్పాన్సిబుల్ గా ఉండేలా చేయాలి. ఇలాంటి పనులు చేయకూడదని చిన్నప్పట్నుంచే అబ్బాయిలకు నేర్పించాలి. ప్రతి ఇంటి నుంచి ఇది మొదలుకావాలి.” అంటూ సూచించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus