వాలెంటైన్స్ డే రోజున కాజల్ డిఫరెంట్ అటెంప్ట్..!

టాలీవుడ్లో 13 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్‌ అగర్వాల్.. గతేడాది అక్టోబర్లో తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తరువాత ఈమె హనీమూన్ ట్రిప్ నిమిత్తం మాల్దీవులకు కూడా వెళ్ళింది. అలా అని ఈమె సినిమాలను నెగ్లెక్ట్ చెయ్యడం లేదు.’ఆచార్య’ ‘ఇండియన్2’ వంటి బడా ప్రాజెక్టులలో కూడా నటిస్తుంది కాజల్.ఇక ఈమె నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ మూవీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయ్యింది.

అంతేకాకుండా ‘మోసగాళ్లు’ చిత్రం కూడా విడుదలకు ముస్తాభవుతుంది. ఇదిలా ఉండగా.. కాజల్ ఈ వాలెంటైన్స్ డే కు కూడా తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈమె కాస్త డిఫరెంట్ గా ట్రై చేసింది.కాజల్ దంపతులు పొల్లాచ్చిలోని ‘శాంతి మెస్‌’కు‌ అతిథిలుగా వెళ్లారట.ఈ విషయాన్ని స్వయంగా కాజల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన ట్విటర్‌ లో కాజల్ ఓ ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది.

ఆమె మాట్లాడుతూ..’నాకు చాలా ఇష్టమైన ‘శాంతి మెస్‌’ పొల్లాచ్చిలో ఉంది. ఆ హోటల్‌ ఓనర్స్ అయిన శాంతి అక్క, బాలాకుమార్‌ అన్న నాకు, గౌతమ్ కు ఎంతో ప్రేమతో భోజనం వడ్డించారు. వాళ్ళ ప్రేమతో చేసే సర్వీసు కారణంగానే.. ఈ మెస్‌ 27 ఏళ్ళుగా రాణిస్తోంది. నేను కూడా 9ఏళ్ళ నుండీ అక్కడి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాను. నాకు కూడా వీళ్ళతో 9 ఏళ్ళ అనుబంధం ఉంది’’ అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది కాజల్.


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus