తమన్నా ని మోసం చేసిన కాజల్!!!
- July 30, 2016 / 10:32 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో రాత్రికి రాత్రే ఏదో ఒకటి జైరీగిపోతూ ఉంటుంది. సడన్ గా సినిమాలో హీరోయిన్ మారిపొద్ది, సినిమా రచయితలు మారిపోతారు. ఇంకా చెప్పాలి అంటే సినిమా దర్శాకుణ్ణి సైతం మార్చేసే అద్భుతమైన అవకాశాలు మన టాలీవుడ్ లో మెండుగా ఉన్నాయి. అయితే అలాంటి టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ పేరుతో దూసుకు వస్తున్నాడు. ఇక ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసేందుకు ముందుగా తమన్నాని ఎంతో కష్టపడి ఒప్పించారు…ఆమె కూడా కాదు…కాదు అంటూనే ఒప్పుకుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, సడన్ గా ఇప్పుడు తమన్నా స్థానంలో కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది.
ఇంతకీ ఏం జరిగింది అంటే…చిత్ర యూనిట్ చెబుతున్న వివరాల ప్రకారం బిజీ షెడ్యూల్‌లో ఓవర్‌నైట్ ఈ సాంగ్‌ని పూర్తి చేసేందుకు రెడీ అయింది తమన్నా. కానీ, తమిళ్ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆమెపై ఆ సినిమా దర్శకనిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో, ఆ పాటనుంచి తప్పుకోవాల్సిన ప్రెజర్ పడడంతో యంగ్‌టైగర్‌కి సారీ చెప్పి మరీ గౌరవంగా పకక్కు తప్పుకుంది తమ్ము బేబీ. ఇక ఈ స్థానంలో ఎవరిని తీసుకుంటే బావుంటుంది అన్న ఆలోచనలో కాజల్ అగర్వాల్ ఒప్పుకోవడంతో కధ సుఖాంతం అయ్యింది.












