Kajal: బాలయ్య గొప్పదనం చెప్పిన కాజల్ అగర్వాల్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నటించడానికి ఈ సినిమాలోని కాన్సెప్ట్ నను ప్రేరేపించిందని కాజల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి ఎంతో అవసరమైన కథతో ఈ సినిమా తెరకెక్కిందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలలో అగ్ర తారలు నటిస్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని

ఆడపిల్లల్ని బలంగా తయారు చేయాలనే అంశంపై ఇచ్చిన సందేశం బాగుందని ఈ సినిమాలో నా పాత్ర ఏమిటనే విషయాన్ని పక్కన పెట్టి మరీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్ గా కనిపిస్తానని ఆ పాత్ర తెలివిగా కనిపించే సరదా పాత్ర అని కాజల్ అగర్వాల్ కామెంట్లు చేశారు.

అనిల్ రావిపూడి టైమింగ్, డైరెక్షన్ బాగుంటుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. బాలయ్య నటనలో ప్రామాణికత ఉంటుందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. బాలయ్యతో పని చేయడం గొప్ప అనుభవం అని కాజల్ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో విజ్జి పాప పాత్ర ఎంతో కీలకమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కొడుకు పుట్టడంతో కొన్ని సవాళ్లు ఎదురు కావడం వాస్తవమే అని కాజల్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నాణ్యమైన సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని (Kajal) కాజల్ తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలతో పాటు మరో మూడు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె చెబుతున్నారు. సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేయడం నాకు కొత్త కాదని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. హీరోలు ఎవరైనా వర్క్ విషయంలో తేడా ఉండదని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాజల్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus